బ్రిటన్ పర్యాటకులకు ఫ్రాన్స్ షాక్

బ్రిటన్ నుండి వచ్చే పర్యాటకులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించనున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో ఈ చర్య తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్‌లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియెల్ అత్తాల్ మాట్లాడుతూ బ్రిటన్ నుండి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.ఈలోగా రాబోయే వేవ్‌కు సన్నద్ధమవుతున్న ఫ్రాన్స్‌కు కొంత సమయం వుంటుందన్నారు. తప్పనిసరి కారణం వుంటే తప్ప బ్రిటన్ నుండి ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.