మాస్కులతో కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువ కాదు!
కరోనా వైరస్ నిరోధానికి వాడుతున్న మాస్కుల వల్ల మనం గాల్లోని కార్బన్డైయాక్సైడ్నే తిరిగి ఎక్కువగా పీలుస్తామన్నది అపోహ మాత్రమేనని తాజా అధ్యయనం సృస్టం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ మియామీ శాస్త్రవేత్తలు మాస్కులు ఉపయోగించే, వారిని పరిశీలించడం ద్వారా ఈ అంచనాకు వచ్చారు. మాస్కలు ధరించినప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది ఏర్పడుతోందని కొందరు చెబుతుంటారని, అయితే ఇది కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువ కావడం వల్ల మాత్రం కాదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ కాంపోస్ తెలిపారు. గాలి ప్రవేశించడంలో ఉన్న ఇబ్బంది కారణంగా ఈ సమస్య రావచ్చని, మరీ బిగుతుగా కట్టుకున్న మాస్కుతోనూ ఇబ్బంది ఏర్పడ వచ్చునని ఆయన వివరించారు. ఇతరులతో తగినంత దూరంలో ఉన్నప్పుడు మాస్కు తొలగించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని చెప్పారు.






