డోసుల మధ్య గ్యాప్ పెంచితే … ముప్పు తప్పదు

కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచితే ముప్పు తప్పదని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచి హెచ్చరించారు. వ్యాక్సిన్‍కు సంబంధించిన రెండు మోతాదుల మధ్య గ్యాప్ పొడిగించడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. వ్యాక్సినేషన్‍లో గ్యాప్ పెంచడానికి బదులుగా నిర్దేశిత షెడ్యూల్‍ను అనుసరించాలని సూచించారు. వైరస్‍కు అడ్డుకట్ట వేయడానికి వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. డెల్టా వేరియంట్ తొలుత భారత్‍లోనే కనిపించిందని, ఇది సెకెండ్ వేవ్‍కు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. డెల్టా వేరియెంట్లు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందాయన్నారు. కొవిడ్‍తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేడయం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్‍కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలన్నారు.