జలుబు చేయడం మంచిదే.. ఎందుకో తెలుసా?

జలుబు చేయడం ఒక విధంగా మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా? సాధారణ జలుబును కలిగించే వైరస్ సోకడం వల్ల కరోనా కారకమైన సార్స్-కొవ్-2 నుంచి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించినట్టు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు.