భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు కరోనా పాజిటివ్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‍కు కూడా వైరస్ పాజిటివ్‍గా నిర్ధారణ అయినట్లు ఈసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.