మాస్క్‌పై మాస్క్… ప్రయోజనమెక్కువ

మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారు. మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండి. అది మరింత బాగా పనిచేయనుంది అని ఫౌచీ ఓ షోలో భాగంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగుచూస్తోన్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ కొత్త రకాలను వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని నిపుణులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే.
మొదటి మాస్క్ తో అక్కడక్కడా ఏమైనా ఖాళీలు మిగిలిపోతే, రెండో మాస్క్ వాటిని పూరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ విధానం వల్ల శ్వాసించేప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్ వల్ల పాజిటివ్ రేటు మరింత పెరగనుంది. భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలు తగ్గించడం, మాస్క్లు ధరించడం తప్పనిసరి. అయితే మాస్కుల్లో నాణ్యత తప్పనిసరి అని మరొకరు వివరించారు.