డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదికి కొవిడ్ పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానికి తాజాగా జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. రూడీ గియులియాని అట్లాంటాలో ముఖానికి మాస్కు ధరించకుండా న్యాయబృందంలోని ఇతర సభ్యులు పలువురితో మాట్లాడుతూ కనిపించారు. న్యూయార్కు గొప్ప మేయరుగా పనచేసిన గియులియాని అమెరికా ఎన్నికల్లో అక్రమాలపై బహిర్గతం చేసేందుకు పోరాడుతూ కరోనా బారిన పడ్డారని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో రూడీ వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.