కొవిడ్ రోగులకు… భారత సంతతి వైద్యుల సాయం

కొవిడ్ రోగులకు అవసరమైన చికిత్స, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు.. భారత్‍కు సహకరించేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, వృతి నిపుణులు మందుకొచ్చారు. కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ సహాయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, భారత్‍లోని వైద్యులు, వృతి నిపుణులు కలిసి దీన్ని మొదలు పెట్టారు. గ్రామాల్లోని కొవిడ్ రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బందికి వర్చువల్‍గా సమాచారాన్ని అందిస్తుంటారు. ఆసుపత్రుల్లో పడకల లభ్యత, వ్యాక్సిన్ సమాచారం అందిస్తారు. స్థానిక ఆరోగ్యసిబ్బంది, ఆర్‍ఎంపీ వైద్యులకు సరైన శిక్షణ అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న రాజా కార్తికేయ తెలిపారు.
గ్రామాల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. సహాయం ప్రాజెక్టు బృందం ప్రాథమికంగా తెలంగాణ, ఆంధప్రదేశ్‍లోని ఆర్‍ఎంపీలతో కలిసి పనిచేస్తోదందన్నారు. త్వరలోనే ఇతర ప్రాంతాలకు సేవలు విస్తరించి కొవిడ్ రోగులకు అవసరమైన చికిత్స, సహాయ సహాయ సహకారాలు అందించనున్నట్లు కార్తికేయ తెలిపారు. న్యూయార్క్లో ఉంటున్న కార్తికేయ 70, 80 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రజల్లో భయాన్ని పారద్రోలి, వారికి మెరుగైయిన చికిత్స అందేలా చేయడమే తన లక్ష్యమని మిన్నెపోలీస్‍కు చెందిన డాక్టర్ సుబ్బారావు ఐనంపూడి తెలిపారు. స్వల్ప లక్షణాలున్న కొవిడ్ రోగులను ఎలా రక్షించాలన్న అంశంపై ఆర్‍ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి సారించామన్నారు.
అమెరికాలో గత యేడాది తమకు ఎదురైన అనుభావాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, వాటిని భారత్‍లోని గ్రామాల్లో వైరస్ కట్టడికి అమలు చేస్తామని తెలిపారు. జూమ్ ద్వారా వారానికి రెండు రోజులు ఆర్‍ఎంపీలతో సమావేశమవుతామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 150 మందికి పైగా ఆర్‍ఎంపీలతో భేటీ అయినట్లు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆర్‍ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు వైద్యపరమైన సమస్యలకు సంబంధించిన సలహాలు, సూచలను అందజేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆర్‍ఎంపీలపై సానుకూల ప్రభావం చూపుతుందని యూఎఇకి చెందిన బలరాంరెడ్డి అన్నారు. తమ ప్రాజెక్టులో సర్పంచులు, కలెక్టర్లను కూడా చేర్చుకుంటామన్నారు.