అమెరికాలో లక్ష దాటిన డెల్టా కేసులు

కరోనా డెల్టా వేరియంట్ కేసులు అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో ఉధృతమయ్యాయి. దీనికి లాక్‍డౌన్ విధించడానికి అమెరికా ప్రభుత్వ ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంథోనీ ఫౌచి తిరస్కరించారు. అదే రోజు దేశంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా కేసులు 20 కోట్లకు చేరువవుతున్నాయి. అంటే ఈ భూగోళం మీద వున్న ప్రతి 39 మందిలో ఒకరికి ఈ కరోనా సోకింది. అమెరికాలో ప్రతి పదిమందిలో ఒకరికి కోవిడ్ వచ్చింది.