కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోవిడ్ టీకా తొలి డోసు వేసుకున్నారు. ఢిల్లీలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌లో ఆయనకు అక్కడి సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. రాజ్‌నాథ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఈ వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సహా అనేక మంది కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖ రాజకీయవేత్తలు కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్ల వయసు నిండిన వారికి, దీర్ఘకాలిక రోగాలుండి 45 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి రెండో దశ కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం కొనసాగుతోంది.