కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. దేశంలో మొత్తం 10 వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మరో 20 వేల ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన సృష్టం చేశారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్ది రోజుల్లో నిర్ణయించనున్నట్టు తెలిపారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో 27 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.