ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్
ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంపై ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ బోర్డు రెండు రోజుల పాటు సమావేశం అయిన సందర్భంగా మంగళవారం ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. మనకు టీకాల అవసరం చాలా ఉంది. అందువల్ల ఈ ఏడాది ఆఖరుకు టీకా అందే అవకాశం ఉందని ఆయన అన్నారు. తొమ్మిది వ్యాక్సిన్లు ఇప్పుడు తయారీలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో కొవాక్స్ వ్యాక్సిన్ ఈ ఏడాది ఆఖరి 2 బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న లక్ష్యంతో సిద్ధమౌతోంది.






