అగ్రరాజ్యంలో కరోనా తగ్గుముఖం…

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి సగటు మరణాలు 600కు పడిపోయాయి. సగానికి పైగా రాష్ట్రాల్లో మరణాలు జీరోకు చేరుకున్నాయి. రోజువారి కొవిడ్ కేసులు సగటు 38 వేలకు చేరింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో దాదాపు రెండున్నర లక్షల కేసులు ఉండగా, ప్రస్తుతం 85 శాతం తగ్గాయి. దాదాపు సంవత్సరం క్రితం అమెరికాలో కొవిడ్ మరణాలు జనవరి నెల మధ్యలో రోజు సగటున 3,400 కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. చివరిసారిగా జూలై ప్రారంభంలో ఇంత తక్కువగా మరణాలు నమోదయ్యాయి. గత నెల నుంచి అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ కాస్త తగ్గుముఖం పడుతోంది. రోగ నిరోధక శక్తికి టీకాలు చాలా కీలకమని జాన్స్ హాప్పిన్స్ విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అమేశ్ పేర్కొన్నారు.