కరోనా వైరస్ గాలిలో ఎంత దూరం… ప్రయాణిస్తుందో తెలుసా ?

కరోనా వైరస్ గాలితో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే ముప్పు తగ్గుతుంది? చాలామంది మెదళ్లను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా మరోసారి సమాధానాలిచ్చింది. కొవిడ్ రోగి నుంచి 3-6 అడుగుల లోపు వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెల్చింది. గాలి, వెలుతురు తగినంతగా లేని ప్రాంతాల్లోనైతే మహమ్మారి ముప్పు ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరమే పొంచి ఉంటుందని నిర్ధారించింది. కాబట్టి వైరస్ నియంత్రణకు మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం వంటివి అత్యవసరమని తమ మార్గదర్శకాల్లో మరోసారి స్పష్టం చేసింది.