కరోనా తీవ్రత తగ్గి… వచ్చే దశాబ్దంలో

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గిపోతోందని, వచ్చే దశాబ్దంలో ఇదొక సాధారణ జలుబుగా మారిపోతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా పరిశోధనలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఉధృతి, మానవ శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థల్లో మార్పుల ఆధారంగా ఈ వైరస్ ప్రభావం తగ్గిపోవడం ఖాయమని అంచనాకొచ్చింది. రానున్న పదేళ్లలో ప్రజలందరిలో కరోనా నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, ఆ తర్వాత కరోనా సోకినా దగ్గు, తుమ్ము వంటి సాధారణ లక్షణాలే ఉంటాయని పేర్కొన్నారు.