ఇండియాలో తొలి టీకా 13నే!
ఇండియాలో తొలి కరోనా వైరస్ టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రధానంగా నాలుగు ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్లు ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వీటిని జీఎంఎస్డీగా పిలుస్తారని, ఇవి కర్నాల్, ముంబై, చెన్నై, కోల్కతాలలో ఉంటాయని తెలిపారు. మొత్తంగా దేశంలో 37 వ్యాక్సిన్ స్టోర్లు ఉంటాయని వెల్లడించారు. ఈ స్టోర్లు భారీ సంఖ్యలో వ్యాక్సిన్ను నిల్వ చేస్తాయని, అక్కడి నుంచి వాటిని పంపిణీ చేస్తారని తెలిపారు. ఆయా స్టోర్లలో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి. ఏ ఉష్ణోగ్రత దగ్గర వాటిని స్టోర్ చేశారన్న వివరాలు డిజిటల్ రూపంలో పరిశీలిస్తామని చెప్పారు.






