అగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజులోనే
అమెరికాలో రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1.30 లక్షలు పాజటివ్ కేసులు రికార్డయ్యాయి. జూన్ నెల చివర్లో రోజుకు కేవలం 11 వేల కేసులు నమోదైన అమెరికాలో.. ఆగస్టు 3 నుంచి భారీగా పెరుగుతున్నాయి. రోజూ లక్ష పైచిలుకు పాజిటివ్ కేసులు వెలుగులొకొస్తున్నాయి. జూన్‌తో పాటు జులై తొలి వారంలోనూ 20 వేల లోపు కేసలు నమోదయ్యాయి. గతేడాది కరోనా తొలి వేవ్‌లో రోజువారీ కేసులు లక్ష దాటడానికి 9 నెలలు పట్టింది. ఇప్పుడు 6 వారాల్లోనే లక్ష పై చిలుకు కేసులు నమోద వుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకు 270 చనిపోతే, శుక్రవారం 700కు చేరింది. మరోవైపు చైనాలోని వుహాన్‌లో 21 కేసులు బయటపడ్డాయి. హుబేయ్ ప్రావిన్స్‌లో 47 కేసులు నమోదయ్యాయి. చైనాలో శనివారం 139 మంది కరోనా బారిపడ్డారు. బ్రెజిల్, ఇండోనేషియా, ఇరాన్, బ్రిటన్‌తో పాటు ఫ్రాన్స్‌లో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.







