10 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రపంచంలో తొలి కరోనా మరణం జనవరి 11న చైనాలోని వుహాన్‌లో సంభవించింది. తాజాగా ఈ కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటింది. అమెరికాలో అత్యధికంగా 2,05,000 మంది మరణించారు. బ్రెజిల్లో 1,42,000, భారత్‌లో 95,000 మందికి పైగా మరణించగా, మెక్సికోలో 76 వేల మంది మృతి చెందారు. మరోవైపు యూరప్‌లో అనేక ప్రాంతాల్లో రెండో దశ తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థులు కళాశాలలకు తిరిగిరావడం, ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించకపోవడంతో రెండో దశ విజృంభిస్తుందని, ఇది త్వరలోనే అమెరికాను తాకుందని నిపుణులు తెలిపారు. కాగా, మరణాలు సంఖ్య 10 లక్షలు దాటడం జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు ప్రకారం మాత్రమేనని, అనేక దేశాల్లో తగినన్ని పరీక్షలు చేయకపోవడం, మరికొన్ని దేశాలు సమాచారాన్ని దాచివేయడం కారణంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.






