భారత్ బయోటెక్ కీలక ప్రకటన …

కరోనా వైరస్ నిరోధానికి కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వాలంటీర్ల ఎన్‍రోల్‍మెంట్ పక్రియ విజయవంతంగా పూర్తియినట్టు వెల్లడించింది. మూడో దశలో 26వేల మందికి టీకా ఇవ్వాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు వాలంటీర్లుగా 25,800 మంది ఎన్‍రోల్ చేసుకోవడం విశేషం. టీకా అభివృద్ధిలో తమకు మద్దతు నిలుస్తున్న అందరికీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ పేరుతో సొంతంగా అభివృద్ధి చేసిన టీకాకు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. 1-2 దశల పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 16 వైరస్ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు అందిస్తున్నామని, తాము తయారుచేసిన కొవాగ్జిన్ సురక్షితమైందని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.