ఏపీలో 5,210 మందికి పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి రికవరీ అయిన వారి సంఖ్య 7.03 లక్షలకు చేరుకుంది. అలాగే కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 65 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 65,89,616 పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 75,517 మందికి పరీక్షలు చేయగా 5,210 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో 5,509 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 7,03,208 మంది కోలుకున్నారు. తాజాగా 30 మంది మృతితో ఇప్పటి వరకు 6,244 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 46,295 ఉన్నాయి.






