సుప్రీం కోర్టులో కరోనా కలకలం…

భారత్‍లో మరోసారి పంజా విసురుతున్న కరోనా మహమ్మారి దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు రూమ్‍లతో పాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేశారు. మరోవైపు నేడు షెడ్యూల్ సమయం కంటే గంట ఆలస్యంగా పలు బెంచ్‍లు ప్రారంభం కానున్నాయి. భారత్‍లో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. వారం రోజుల్లోనే పది లక్షల కేసులు కొత్తగా నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.