చిరంజీవి అల్లుడికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‍దేవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా కల్యాణ్‍దేవ్ తన ఇన్‍స్టాగ్రామ్‍లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే క్వారంటైన్‍లో ఉన్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా అని ఆయన పేర్కొన్నారు.