అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

అమెరికాలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మూడువేలకు పైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్ హాప్‍కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.90 లక్షల మంది వైరస్ పాజిటివ్‍గా పరీక్షించారు. అలాగే ఒకే రోజు 3,676 వైరస్ మరణాలను నమోదు చేసినట్లు జాన్స్హాప్కిన్ విశ్వవిద్యాలయం తెలిపింది. అంతకు ముందు రోజు వైరస్‍తో నాలుగువేల మంది వరకు మృతి చెందారు. కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ప్రకారం.. ప్రస్తుతం 1.31 లక్షల మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 21.8 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదవగా. 3.68 లక్షల మంది వరకు మృత్యువాతపడ్డారు.