దేశంలో తగ్గిన కరోనా తీవ్రత..

దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 2,726 మంది మరణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,77,031 మంది వైరస్ సోకి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,13,378 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 25,90,44,072 మందికిపైగా వ్యాక్సిన్ అందించారు.