దేశంలో కొత్తగా 70,421 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 3,921 మంది మృత్యువాత పడ్డారు. 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,73,158 ఉన్నాయి. వ్యాక్సినేషన్ల సంఖ్య 25,48,301కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.