దేశంలో తగ్గిన కేసులు… మళ్లీ పెరిగిన

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు. 24 గంటల్లో 1,21,311 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,79,11,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,67,081కు చేరింది. టీకా డ్రైవ్‍లో మొత్తం 24,96,00,304 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.