దేశంలో స్వల్పంగా తగ్గిన.. కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 91,702 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం కొవిడ్ కేసుల సంఖ్య 2,92,74,823గా ఉంది. 24 గంటల్లో 3,403 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,63,079గా ఉంది. 24 గంటల్లో 1,34,580 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,77,90,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 11,21,671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్‍లో భాగంగా ఇప్పటి వరకు 24,60,85,649 డోసులు వేసినట్లు చెప్పింది.