దేశంలో కరోనా మరణ మృదంగం… రికార్డు స్థాయిలో

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,51,367 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. ఇందులో 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 37,21,98,253 మందికి కరోనా పరీక్షలు చేశారు. టీకా డ్రైవ్‍లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.