దేశంలో స్వల్పంగా పెరిగిన.. కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,89,069 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,219 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,53,528 మంది కరోనాతో మరణించారు. 24 గంటల్లో 1,62,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,75,04,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్‍లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు వేసినట్లు చెప్పింది.