దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20 కోట్ల మార్క్ దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 4,29,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,86,351గా ఉన్నాయిని, 140 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.







