దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

భారత్‍లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,329 మంది మృతి చెందారు. దీంతో దేశంలో 3,93,310 మంది కరోనాతో మృతి చెందారు. 24 గంటల్లో 64,527 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,91,28,267 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,12,868 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,34,445 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో 30,79,48,744 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.