దేశంలో తగ్గిన కొత్త కేసులు…

భారత్‍లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 18,59,469 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 54,069 మందికి కరోనా పాజిటివ్‍గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,321 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో 3,91,981 మంది మరణించారు. 24 గంటల్లో 68,885 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 2,90,63,740 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,27,057 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశశ్యాప్తంగా 3,00,82,778 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దేశంలో మొత్తం 30,16,26,028 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 39,78,32,667 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.