దేశంలో తగ్గిన కరోనా కేసులు ….

భారత్‍లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. 24 గంటల్లో 1,358 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 68,817 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,89,94,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,43,194 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,00,28,709 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 29,46,39,511కు చేరింది.