దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన కరోనా

దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,167 మంది కొవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 81,839 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం ఇప్పటివరకు 2,89,26,038 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,62,521 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 28,87,66,201 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.