దేశంలో తగ్గుముఖం పట్టిన.. కరోనా

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,422 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44,199గా నమోదు అయ్యింది. దేశంలో ప్రస్తుతం 7,02,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,88,135కి చేరింది.ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 28,00,36,898 గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.