దేశంలో కొత్తగా 60 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు 1,647 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,85,137 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. టీ డ్రైవ్‍లో భాగంగా 27,23,88,783 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.