చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. వరుసగా ఐదో రోజూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టిందది. కరోనా పరీక్షలను వేగవంతం చేసింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేయడంతో పాటు వందలాది విమానాలను రద్దు చేసింది. చైనా దేశవ్యాప్తంగా సార్స్`కోవీ`2కి సంబంధించిన సాముహిక పరీక్షను కూడా వేగవంతం చేయనుంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. అలాగే సరిహద్దుల మూసివేతను కొనసాగిస్తున్నది. పర్యాటకులతో కలిసి ప్రయాణించిన ఒక వృద్ధ జంట కారణంగా చైనాలో తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.