చైనాలో మరోసారి కరోనా కలకలం

చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఆకస్మికంగా వైరస్ వ్యాప్తిస్తున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బీజింగ్‌లోని సెంట్రల్ జిల్లాలైన చాయాంగ, హైడియన్‌లలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో వైరస్ సోకిన వ్యక్తుల సన్నిహితుల నుంచి వ్యాపించినట్లు తెలిసింది. మరో వైపు వైరస్ నియంత్రణకు చైనా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా సోకిన వ్యక్తిని కలిసిన ఒక వ్యక్తి సందర్శించిన డాంగ్‌చెంగ్‌లోని రాఫెల్స్ సిటీ మాల్‌ను మూసివేశారు. అందులోని సిబ్బంది, కస్టమర్లకు కరోనా పరీక్ష నిర్వహించే వరకు బయటకు పంపలేదు. తరువాత ఆ మాల్ మూసివేశారు.