చైనాలో మళ్లీ వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 14 రోజుల్లో 14 రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 17-29 మధ్యలో కొత్తగా 377 కేసులు నమోదు అయ్యాయి. సంఖ్య తక్కువే అయినప్పటికీ వచ్చే ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పట్ల కఠినంగా వ్యవహరించాలని చైనా నిర్ణయించింది. పోర్టుల్లో సరిహద్దు నగరాల్లో నిఘాను పెంచి టెస్టులు నిర్వహిస్తున్నది. దీంతో పాటు అర్హులైన వారికి బూస్టరు డోసులు వేస్తున్నది. డిసెంబర్ లోగా 3`11 ఏండ్ల వయస్సున్న పిల్లలందరికీ కరోనా టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. చైనాలో ఇప్పటికే 75.8 శాతం మంది రెండు డోసుల టీకా వేసుకొన్నారు.