అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ

అమెరికా కరోనా వైరస్‌తో అల్లాడుతున్నది. కేసులు తగ్గినట్లే తగి మళ్లీ పంజా విసురుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు రావటం విశేషం. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 2,579 మంది చనిపోయారు. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి.
అమెరికాలో సెప్టెంబర్ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఒక్కరోజులోనే 1.65 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. డెల్లా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్టు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడిరచింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.