అగ్రరాజ్యంలో రోజుకు లక్ష కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 559 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో 3,63,01,744 మంది కరోనా బారినపడ్డారు. అదేవిధంగా 6,31,897 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,98,05,593 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 58,64,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రధానంగా ఫ్లోరిడాపై కరోనా పంజా విసురుతోంది.
గడిచిన 24 గంటల్లో ఒక ఫ్లోరిడాలోనే 20,133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఫ్లోరిడాలో 27,24,131 మంది కరోనా బారినపడ్డారు. 39,403 మంది చనిపోయారు. ఫ్లోరిడా తరువాత టెక్సాస్‍లో దారుణ పరిస్థితి నెలకొంది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 14,173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది చనిపోయారు. ఇప్పటి వరకు టెక్సాస్‍లో 32,01,828 మంది కరోనా బారినపడగా.. 53,716 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మిస్సోరీ, అరిజోనా రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.