అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,43,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 660 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడి వారి సంఖ్య 3,72,03,649కు చేరుకుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 6,36,298 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,00,97,898 మంది కరోనాను జయించారు. అయితే ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 64,69,453 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో అత్యధికంగా 24 వేల కేసులు నమోదయ్యాయి. 18 మది చనిపోయారు. ఆ తరువాత 14 వేల కేసులతో టెక్సాస్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్లో 5,040 కేసులు బయటపడగా, 28 మంది చనిపోయారు. పెన్సిల్వేనియా, జార్జియా, కాలిఫోర్నియాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.







