కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‍సింగ్‍కు కరోనా పాజిటివ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‍సింగ్‍కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్‍లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్‍లో ఉండాలని కోరారు.