కరోనా టీకా తీసుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు టీకాలు తీసుకుంటూ ప్రజలంతా కూడా టీకాలు తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఛత్తీస్‍గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. రాయ్‍పూర్‍లోని జవహర్‍లాల్ నెహ్రూ మెమోరియల్ మెడికల్‍లో కాలేజీలో వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు.