కాలిఫోర్నియాలో కోవిడ్ పరిమిత ఆంక్షలు
కాలిఫోర్నియాలో కోవిడ్ వైరస్ విజృంభించకుండా పరిమితంగా ఆంక్షలు విధిస్తున్నట్లు గవర్నర్ న్యూసమ్ ప్రకటించారు. అమెరికాలో వివిధ చోట్ల కరోనా వైరస్ బాగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రాత్రిపూట ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు అత్యవసర పనులకు తప్ప ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ ఆదేశాల వల్ల కోవిడ్ కేసులు కట్టడి చేసేందుకు అవకాశాలు కలుగుతాయని అధికారులు పేర్కొన్నారు.






