ఆ బ్లడ్ గ్రూపు వారికి కరోనా ముప్పు తక్కువే …
రక్త గ్రూపును బట్టి కరోనా ముప్పు ఆధారపడి ఉంటున్నట్టు రెండు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఓ బ్లడ్ గ్రూపువారు మహమ్మారి బారినపడే ప్రమాదం చాలా తక్కువనీ, ఒకవేళ కొవిడ్ వచ్చినా, వ్యాధి తీవ్రత వారికి ఎక్కువ ఉండదని తేలింది. డెన్మార్, కెనడాల్లో జరిగిన అధ్యయనాల వివరాలను బట్టి తెలుస్తోంది. దక్షిణ డెన్మార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుమారు 4,70,000 మంది కరోనా బాధితుల ఆరోగ్య వివరాలను సేకరించారు. తర్వాత 22 లక్షల మంది సాధారణ ప్రజల డేటాతో వాటిని పోల్చి చూశారు. వైరస్ బాధితుల్లో ఏ, బీ, ఏబీ గ్రూపులవారు అధిక సంఖ్యలో ఉండగా.. ఓ గ్రూపు వారు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నట్టు వెల్లడైంది. మరో వైపు వాంకోవర్ నగర ఆసుపత్రుల్లో ఆరోగ్యం విషమించిన 95 మంది కరోనా బాధితుల వివరాలను కెనడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఓ, బీ గ్రూపుల వారితో పొలిస్తే, ఏ, ఏబీ గ్రూపులవారే అత్యధికంగా కరోనా బారిన పడుతున్నట్టు తేల్చారు.






