కోవిడ్ టీకా తీసుకున్న సీఎం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోవిడ్ టీకా తీసుకున్నారు. పాట్నా హాస్పిటల్‍లో టీకా వేయించుకున్నారు. కోవిడ్ టీకా తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు. గవర్నర్ నేతృత్వంలో ఈ నెల 17వ తేదీ అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకున్న వారిలో డిప్యూటీ సీఎంలు తార్‍కిషోర్ ప్రసాద్, రేణూ దేవీలు ఉన్నారు.