భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ పంపిణీపై

కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కొవాగ్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల తెలిపారు. టీకాలను సరఫరా కోసం సంప్రదించిన ఇతర రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొవాక్జిన్ టీకాను సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్, ఛత్తీస్‍ఘడ్, అసోం, ఒడిశా, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.