40పైగా దేశాలకు భారత్ బయోటెక్ టీకా

తమ కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్‌ను నలభైకి పైగా దేశాలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇందుకు అవసరమయ్యే అవసరమైన అధికారిక అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఈ వారం చివర్లోగా బ్రెజిల్‌తో సహా పలు అరబ్ దేశాలకు మిలియన్ డోసుల వ్యాక్సిన్ పంపనున్నట్టు సంస్థ ప్రకటించింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా అమెరికాలో తమ టీకా విక్రయాలకు గాను అక్కడి ఫార్మా సంస్థ ఆక్యుజెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ టీకా వాడకం సురక్షితమని భారత్‌లో ఔషద నియంత్రణ సంస్థలు సృష్టం చేసినప్పటికీ భారత్ బయోటెక్ నియమాలను అనుసరించి ప్రకారం 25,800 మంది వాలంటీర్లపై మానవ ప్రయోగాలు నిర్వహించటం గమనార్హం. కాగా, మార్చిలో వెలువడనున్న ఫలితాలను గురించి వేచిచూస్తున్నామని సంస్థ తెలిపింది.