భారత్ బయోటెక్ కీలక నిర్ణయం. వ్యాక్సిన్ ధరను

కరోనా వ్యాక్సిన్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. రాష్ట్రాలకు రూ.400లకే కొవాగ్జిన్‍ను సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. గతంలో టీకా డోసును రూ.600గా నిర్ధారించిన భారత్ బయోటెక్ దాని రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ధరను తగ్గిస్తూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు రూ.300లకు విక్రయించనున్నట్టు ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. గతంలో ఈ ధర రూ.400 ఉండేది. తాజాగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ధరను రూ.600 నుంచి రూ.400లకు తగ్గించింది. సవరించిన ధరకు రాష్ట్రాలకు అందించనుంది. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది.